Thursday, 25 June 2026 07:00:24 PM

ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు...

Date : 10 March 2025 01:51 PM Views : 574

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన సుపారీ గ్యాంగుతో ప్రణయ్ ను హత్య చేయించిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఈ కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది.ఈ కేసులో ముద్దాయిలను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఉన్న A1 నిందితుడు మారుతీరావు దాదాపు నాలుగేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకున్నారు.A2 నిందితుడైన సుభాష్ కుమార్ కు ఉరి శిక్ష విధించగా మిగతా నిందితులైన ఏ3 అస్గర్ ఆలీకి, ఏ4 బారీకి, ఏ5 కరీంకు, ఏ6 శ్రావణ్ కుమార్ కు, ఏ7 శివకు, ఏ8 నిజాంలకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ హత్యోదంతంలో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :