ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : ఫ్లెక్సీ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మరి దాడికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం కాలనీకి చెందిన ఒక వ్యక్తిపై జనగామ కు చెందిన ముగ్గురు యువకులతో పాటు గోదావరిఖనికి చెందిన మరో యువకుడు దాడి చేసినట్లు తెలుస్తుంది. అయితే గతంలో జనగామలో నిర్వహించిన ఓ ఉత్సవాలకు సంబంధించి ఫ్లెక్సీలను సదరు వ్యక్తి ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఫ్లెక్సీలను చించి వేశారని గత నెలలో పోలీస్ స్టేషన్ లో గాయాలైన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇది మనసులో పెట్టుకొని సదరు యువకులు కత్తితో దాడికి పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Reporter
Aakanksha News