Saturday, 13 June 2026 05:35:56 PM

వైద్యుల నిర్లక్ష్యంతో పురిటిలోనే శిశువు మృతి..

Date : 18 April 2025 11:50 AM Views : 572

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ములుగు జిల్లా : ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డెలివరీ కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన గర్భిణీ మహిళా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గర్భంలోనే బిడ్డ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... విల్లా రవళి అనే గర్భిని మహిళ డెలివరీ కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. దీంతో రవళిని పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే పురిటి నొప్పులు వస్తున్న సమయంలో రవళి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆపరేషన్ చేయాలని బంధువులు వైద్యులను అభ్యర్థించారు. అయినా పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్తామని తెలిపిన వైద్యులు పట్టించుకోకుండా బలవంతంగా నార్మల్ డెలివరీ చేయడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే ఘటనపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. అంతేకాకుండా మృతి చెందిన శిశువును మా చేతిలో పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వైద్యుల బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :