ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం గుర్తు తెలియని నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది.. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ హాస్పిటల్ పక్కన బస్ స్టాప్ ముందు ఉన్న డ్రైనేజీ వద్ద శిశువు మృతదేహం వర్షానికి కొట్టుకొని రావడంతో హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది నవజాత శిశువును గుర్తించి హాస్పిటల్ డ్యూటీ డాక్టర్‌కు సమాచారం అందించారు. అయితే శిశువును పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో మాదాపూర్ పోలీస్ లకు సమాచారం అందించగా పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించి కేసును నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News