ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటికే దొంగలు కన్నం వేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మేడారం మాజీ ఎమ్మెల్యే దివంగత మాలం మల్లేశం కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం హైదరాబాద్ కు వెళ్లారు. అయితే తిరిగి వచ్చి చూసే సరికి వెనుక వైపు నుండి చొరబడిన దొంగలు మొదటి అంతస్తుల్లో ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. అయితే ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు జాగిలాలు వేలిముద్రల నిపుణులతో కలిసి వివరాలకు సేకరిస్తున్నారు.
Admin
Aakanksha News