ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / పెనుగొండ సతీష్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అలాగే మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...గుడిహతర్నూర్ మండలం మేకలగండి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News