Friday, 25 September 2026 04:19:51 AM

వరంగల్ జిల్లా కొడకండ్లలో విషాదం....

అలీంపూర్ దుర్గమ్మ గుడి వద్ద కారు బోల్తా, ఒకరి మృతి...

Date : 07 January 2026 01:51 PM Views : 318

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం అలీంపూర్ గ్రామ పరిధిలోని దుర్గమ్మ గుడి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడకండ్ల వాసులు కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో అలీంపూర్, కొడకండ్ల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :