ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 5వ ఇంక్లైన్ వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. 5వ ఇంక్లైన్ కు చెందిన ముత్తునూరి శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రేమ వ్యవహారంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించగా 60 శాతం కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News