Sunday, 27 September 2026 07:28:42 AM

తహసిల్దార్ పై కేసు నమోదు...

Date : 05 January 2025 04:54 PM Views : 474

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో సర్వే నంబర్, 900, నందు1.10గుంటల భూమి బదలాయింపు విషయంలో పలకపల్లి అలీ, గతంలో ఇక్కడ తహసిల్దార్లుగా పని చేసిన కృష్ణయ్య, పౌల్ లపై ఐ పి సి (IPC420,199) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు న్యాయవాది, జి .ప్రశాంత్ కుమార్, ఒకప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ భూమి మాలె.శంకరయ్య తండ్రి ఎల్లయ్య అమ్రాబాద్ అను వ్యక్తికి వారసత్వంగా వస్తున్న భూమి ఈ భూమిని ఊరి ప్రజలకు ఉపయోగకరంగా ఉండడం కోసం ఎకరం భూమిని బస్టాండ్ కొరకు దానంగా ఇచ్చారు.10 గుంటల భూమి మాత్రమే మిగిలింది. మిగిలిన భూమిని సదరు యజమాని శంకరయ్యకు ఇవ్వకుండా, అమ్రాబాద్ లో గతంలో తహసీల్దార్లు గా పని చేసిన 1.పౌల్, 2.కృష్ణయ్య లు లంచం, తీసుకొని ఎటువంటి డాక్యుమెంట్స్, లేని పల్కపల్లి అలీ అను వ్యక్తి పేరు మీద 0.5 గుంటల భూమిని బదలాయింపు చేశారు. బాధితుల నుండి వచ్చిన సాక్షాలను పరిశీలించిన గౌరవ కోర్టు వీరి ముగ్గురి పైన క్రిమినల్ కేసు నమోదు చేయమని ఉత్తర్వులు జారీ చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :