ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న సనత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు సనత్ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరికాలనికి చెందిన నివాసి.ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వైద్య కళాశాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Aakanksha News