ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జగిత్యాల జిల్లా : రోడ్డు ప్రమాదంలో ఎస్.ఐ మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం సిల్వకోటూరు సమీపంలో ఎస్.ఐ శ్వేతా కారు చెట్టుకు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఎదురుగా వస్తున్న ధీచక్ర వాహనాన్ని డీ కొట్టిన తరువాత కారు వేగంగా ఉండటంతో చెట్టుకు డీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ధీచక్ర వాహన దారుడితో పాటు ఎస్.ఐ శ్వేతా కూడా మృతి చెందారు. ధర్మారం నుండి జగిత్యాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం డీసీఆర్ బి లో ఎస్.ఐ శ్వేతా విధులు నిర్వహిస్తున్నారు.
Admin
Aakanksha News