Tuesday, 11 August 2026 02:57:35 PM

విషాదంగా మారిన ప్రేమికుల గోదావరి స్నానం..!

గోదావరిలో ఈదుతూ యువతి మృతి – యువకుడిని కాపాడిన జాలరులు..!

Date : 26 October 2025 01:11 PM Views : 1428

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : గోదావరి తీరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమలో పడ్డ ఇద్దరు యువతీ యువకులు గోదావరి నదికి స్నానానికి వెళ్లి దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు స్థానికంగా నివసించే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ గత కొంతకాలంగా పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి, ఆ యువతితో గోదావరి నది శివారుకు వెళ్లాడు. అందరూ కలిసి నదిలో స్నానం చేస్తుండగా, యువతి అనుకోకుండా లోతు ప్రాంతంలోకి వెళ్లి మునగసాగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడూ కొట్టుకుపోయాడు.అయితే అల్లరి చెలరేగడంతో సమీపంలో ఉన్న జాలరులు వెంటనే స్పందించి యువకుడిని కాపాడగా, యువతి మాత్రం నీటిలో మునిగిపోయింది. స్థానికులు కుటుంబసభ్యులు ఆమెను బయటకు తీశారు కాని అప్పటికే ప్రాణాలు విడిచింది.ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :