Tuesday, 11 August 2026 04:10:25 PM

మద్యం మత్తులో యువకుడు హింసాత్మక దాడి...

– ముగ్గురికి తీవ్ర గాయాలు

Date : 11 August 2025 06:34 AM Views : 556

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నిజామాబాద్ జిల్లా : మద్యం మత్తులో ఓ యువకుడు సీసా పగలగొట్టి ముగ్గురిపై దాడి చేసి గాయపరిచిన ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను ఆదివారం పోలీసులు వెల్లడించారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, గోపనపల్లి గ్రామానికి చెందిన మదన్ అనే యువకుడు రాత్రి మద్యం సేవించి గ్రామంలోని ఓ కిరాణా షాపు షట్టర్ పక్కన నిద్రిస్తున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన శైలేందర్, అనిల్ అనే ఇద్దరు యువకులు అక్కడికి రాగా, మదన్ వద్దకు వెళ్లే క్రమంలో వారి కాలు అతనికి తగిలింది. ఈ విషయంపై ఆగ్రహించిన మదన్, అక్కడే ఉన్న కల్లు సీసా పగలగొట్టి వారిని వెంబడించి దాడి చేశాడు.దాడిలో శైలేందర్, అనిల్ గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అనిల్ సహోదరి పైన కూడా మదన్ దాడి చేసి గాయపరిచాడు. గ్రామస్తులు వెంటనే స్పందించి ముగ్గురు గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై బాధితురాలు దీపిక ఫిర్యాదు చేయగా, ఎహెచ్‌వో మహమ్మద్ ఆరిఫ్ మదన్‌పై అత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడి అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :