Thursday, 25 June 2026 07:56:20 PM

నేను యూనిఫాంలో వచ్చా.. ఎవనివిరా నువ్వు?" అంటూ చిందులు వేసిన సీఐ..

మరోసారి వివాదంలోకి 1టౌన్ పోలీస్‌స్టేషన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి.... – వీడియో సోషల్ మీడియాలో వైరల్

Date : 04 November 2025 08:04 AM Views : 882

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసు ప్రవర్తన మరోసారి వివాదాస్పదమైంది. రోడ్డు వెడల్పు పనుల్లో గూడు కోల్పోతున్న ఓ బాధితుడిపై ఆయన నోరుపారేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.వివరాల్లోకి వెళ్తే– గోదావరిఖని హనుమాన్‌నగర్ లో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో గణేష్‌ మెకానిక్‌ షెడ్‌ వద్దకు అధికారులు ఎక్స్కవేటర్‌తో చేరుకున్నారు. తమ గుడిసెను, దుకాణాన్ని కూల్చివేస్తున్నారని బాధితులు అధికారులు ఎదుట వాదనలు ప్రారంభించారు.ఈ క్రమంలో అక్కడికి గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడే బదులు, తాను యూనిఫాంలో ఉన్నానని రెచ్చిపోయారు. లంజా కొడకా..! నేను యూనిఫాంలో వచ్చాను.. బడకవ్‌, ఎవనివిరా నువ్వు?" అంటూ బాధితుడు రేడియం శ్రీనుపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్లు వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.అంతటితో ఆగకుండా ఆయన చిందులు వేస్తూ, చేయి చేసుకునేంత దూకుడుతో వ్యవహరించినట్టు సమాచారం. అనంతరం రేడియం శ్రీనును పోలీస్‌ స్టేషన్‌ కు తరలించి సుమారు రెండు గంటలపాటు అక్కడే ఉంచినట్లు స్థానికులు తెలిపారు.ఈ సంఘటనను అక్కడున్న కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో, ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు పోలీస్‌ అధికారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీడియో వైరల్‌ అయిన వెంటనే సీఐ ఇంద్రసేనారెడ్డి అనంతరం ఆయన బాధితుడిని పిలిపించి, "తిట్టలేదని" రాసుకున్న రాజీపత్రం తీసుకొని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది.స్థానిక ప్రజలు సీఐ దురుసు ప్రవర్తనపై మండిపడుతూ, "ప్రజల సమస్యలపై స్పందించాల్సిన అధికారి ఇలా ప్రవర్తిస్తే ప్రజలు ఎవరిపై నమ్మకం ఉంచాలి?" అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరిపించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా సదరు సిఐ ప్రవర్తన వ్యవహార శైలి ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సీఐ తీరుపై రోడ్డెక్కిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్న సదురు అధికారిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందనే ప్రచారం సాగుతుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :