ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం ఎర్రుపాలెం మండల పరిధిలోని బంజారా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చేపల వేటకు వెళ్లి వరద నీటి ప్రవాహంలో గల్లంతైన విషాద ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మినవోలు బ్రిడ్జి సమీపంలో కట్లేరు వాగులో చేపల వేటకు వెళ్లిన బాధవత్ రాజు (55), భూక్యా కోటి (46), ముక్త (25) అనే వ్యక్తులు ఆచూకీ లేకుండా పోయారు.వీరంతా వాగు ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో వేటకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. వరద నీరు అకస్మాత్తుగా పెరగడంతో ముగ్గురు గల్లంతైనట్టు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎర్రుపాలెం సీఐ మధు, తహసిల్దార్ ఉషా శారద, ఎస్సై రమేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.తీవ్రంగా ప్రవహిస్తున్న వాగులో గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం రెవెన్యూ, పోలీసు బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Admin
Aakanksha News