Wednesday, 11 February 2026 09:06:39 PM

శుభకార్యానికి వెళ్తూ... తిరిగిరాని లోకాలకు...

గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు పరిస్థితి సైతం విషమం....అక్కడికక్కడే ఇద్దరు మృతి....నలుగురు పరిస్థితి విషమం

Date : 19 April 2025 10:42 AM Views : 442

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జోగులంబ గద్వాల జిల్లా : శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో పుల్లారెడ్డి, లక్ష్మిసుబ్బమ్మ దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు వెళ్తున్న సమయంలో ఇటిక్యాల మండలంలోని 44వ జాతీయ రహదారిపై ప్రియదర్శి హోటల్‌ వద్ద కారు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ధర్మారెడ్డి అనే వ్యక్తి కుటుంబీకులతో కలిసి శుభకార్యానికి హాజరయ్యేందుకు నంద్యాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :