ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రిపై కుటుంబ సభ్యులు దాడి చేసి ఫర్నిచర్ ద్వాంసం చేసారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మర్రిచెట్టు తండాకు చెందిన ముడావత్ నందిని మంగళవారం రాత్రి ప్రసవం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి రాగ వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయడంతో పండంటి మగ శిశువు జన్మించాడు. అయితే చిన్నారి ఆరోగ్యం బాగా లేదని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.అయితే శిశువును హైదరాబాద్‌కు తీసుకెళ్లగ పరీక్షించిన వైద్యులు బాబు మృతి చెందాడని ధృవీకరించారు. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్‌పై దాడికి పాల్పడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Admin
Aakanksha News