Friday, 05 December 2025 05:21:35 AM

విద్యార్థి సంఘం నేతల మధ్య ఘర్షణ...⁉️

పగిలిన ఓ విద్యార్థి సంఘం నేత తల.. నాటి నుండి నేటి వరకు అంత వివాదాస్పదమే

Date : 05 December 2024 01:24 PM Views : 2367

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరి విద్యార్ధి సంఘం నేతల మధ్య ఘర్షణ జరగడంతో నడిరోడ్డుపైనే ఒకరిపై మరొక్కరు దాడి చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిరుద్యోగ విజయోత్సవ సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే ఈ సభకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే సభ విజయవంతం కోసం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల వద్ద ఇద్దరు విద్యార్థి సంఘం నేతలు జన సమీకరణ చేస్తున్న సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఓ విద్యార్ధి సంఘం నేత తల పగిలి కుట్లు పడగా... మరో విద్యార్ధి సంఘం నేతకు స్వల్ప గాయాలయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పారిశ్రామిక ప్రాంతంలో చర్చనియాంశంగా మారింది...

గతంలోనూ తోటి విద్యార్థి సంఘం నేతల మీద దాడులు... ❓

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఓ పార్టీ విద్యార్థి సంఘం వివాదాలకు నీలయంగా మారుతున్నాడా.. అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ కలిగిన పార్టీలో విద్యార్థి సంఘం ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో జరిగిన గొడవలో తోటి విద్యార్థి సంఘం నేతపై దాడి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే కాకుండా సదురు నేత తనకు అనుకూలంగా వ్యవహరించడం లేదని మరో విద్యార్థి సంఘం నేతపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలు సైతం ఎన్నో ఉన్నాయి. నాటి నుండి నేటి వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా విద్యార్థి సంఘంలో సదరు నాయకుడు విద్యార్థి సంఘం నేతగా కొనసాగడం పలు విమర్శలకు తావిస్తోంది. సదురు విద్యార్థి సంఘం నేత వైఖరి పట్ల పార్టీ ఎన్నోసార్లు అబసుపాలైనట్లు కొంత మంది సొంత పార్టీ నాయకులే విమర్శించడం కోస మెరుపు.. ఇప్పటికైనా సదురు నేత ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందా... ⁉️ ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాల్సిందే..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :