Friday, 16 January 2026 08:50:06 AM

రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం...

విధులకు వస్తు డివైడర్ ను ఢీకొట్టిన.. కారు అక్కడికక్కడే మృతి

Date : 21 April 2025 04:52 PM Views : 631

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ మన్నెగూడ నుంచి తెలకపల్లి కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విధి నిర్వహణలో భాగంగా పాపిశెట్టి శ్రీనివాసులు తన కారులో వస్తుండగా శ్రీశైలం జాతీయ రహదారిపై పెద్దాపూర్ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు తన కారు కల్వర్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోజులాగే విధులకు హాజరవుతున్న క్రమంలో ప్రధానోపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంపై తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. అయితే ఈ నెలాఖరులోనే మృతి చెందిన శ్రీనివాసులు పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిని కలచివేసింది. ఈ ఘటనపై నాగర్ కర్నూల్ డీఈఓ రమేష్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు కల్వకుర్తి ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. మృతునికి భార్య కూతురు ఉన్నారు.ఈ మేరకు వెల్దండ ఎస్ఐ కురుమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :