Friday, 16 January 2026 08:33:14 AM

కరీంనగర్ జిల్లాలో డీజిల్ దొంగలకు దేహశుద్ది...

Date : 11 January 2025 02:45 PM Views : 699

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో గత కొంత కాలంగా వాహనాల్లో ఉన్న డీజిల్ చోరీకి గురవుతున్న క్రమంలో ఎంతో మంది వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే డీజీల్ దొంగలను పట్టుకొని స్థానికులు చితకబాదిన సంఘటన బొమ్మకల్ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శివారు ప్రాంతంలో కొంత మంది డ్రైవర్లు సేద తీరడానికి లారీలను నిలిపివేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆగి ఉన్న లారీ నుండి డీజిల్ తీస్తుండగా పట్టుకొని లారీ యజమానులు, స్థానికులు, డ్రైవర్లు కట్టేసి చితకబాదారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :