Thursday, 25 June 2026 08:00:50 PM

మద్యం మత్తులో గడ్డి మందు తాగి వ్యక్తి మృతి...

Date : 08 November 2025 09:13 PM Views : 967

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : మద్యం మత్తులో గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన దారుణ సంఘటన ఓదెల మండలంలోని జిలకుంట గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే... జిలకుంట గ్రామానికి చెందిన దండు రాజు (47) అనే వ్యక్తి మద్యం మత్తులో గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు దండు రాజు, తండ్రి లక్ష్మయ్య, రజక కులానికి చెందినవారు. వృత్తి హమాలీగా జీవనం సాగించేవాడు.సమాచారం మేరకు నవంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న దండు రాజు గడ్డి మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే అతన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11:45 గంటలకు రాజు మృతిచెందాడు.మృతుడి భార్య దండు రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓదెల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ కిషన్ తెలిపారు.గ్రామంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :