Monday, 10 August 2026 05:35:54 PM

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం...

Date : 02 September 2025 10:57 PM Views : 1398

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం జరిగిన ఘటన స్థానికులను కలచివేసింది. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ఓ కింది స్థాయి ఉద్యోగి తన భార్యను ప్రసవం కోసం తీసుకువచ్చారు. అయితే వైద్యులు మొదట్లో నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి సిజేరియన్ చేయకుండా ఆలస్యం చేసినట్లు బంధువులు ఆరోపించారు. ఈలోగా గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బతికి ఉండేది. డాక్టర్లు నిర్లక్ష్యం చేసి అమూల్యమైన ప్రాణం పోగొట్టారని కన్నీరుమున్నీరుగా వాపోయారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :