Tuesday, 11 August 2026 01:48:11 PM

వాసు మోసానికి బలైన ప్రశాంతి...

ప్రాణాలు తీసిన ప్రేమ.. మహిళా కానిస్టేబుల్ మృతి

Date : 26 July 2025 12:25 PM Views : 591

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కడప జిల్లా : ప్రేమ విషాదాంతం గా మారి ఒక మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రశాంతి (25) ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా మార్వాడకు చెందిన వాసుతో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడగా, అది కాస్త ప్రేమగా మారింది. అయితే, వాసు ఇప్పటికే వివాహం అయిన విషయాన్ని ప్రశాంతికి దాచిపెట్టాడు.కొంతకాలం తరువాత వాసును పెళ్లి విషయమై ప్రశాంతి ఒత్తిడి చేయగా, వాసు ముఖం చాటేశాడు. దీంతో ఆవేదనకు గురైన ప్రశాంతి, వాసు ఇంటికే వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంతి మృతి చెందింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటనతో ప్రశాంతి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :