Saturday, 26 September 2026 06:32:04 AM

జగిత్యాల జిల్లాలో దారుణం....

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మరు గంగారెడ్డి దారుణ హత్య

Date : 22 October 2024 11:46 AM Views : 441

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మరు గంగారెడ్డి హత్యకు గురైయ్యారు. ఈ హత్యకు గ్రామంలో రాజకీయ కక్షలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సంఘటనపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.జగిత్యాల, ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసారు.జగిత్యాలలో బిఆర్ఎస్ రాజ్యము నడుస్తుందా...కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు.కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.పక్క పథకం ప్రకారమే గంగారెడ్డిని హత్య చేసినట్టు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో BRS రాజ్యంమా లేక కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నించారు.వెంటనే హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :