Thursday, 25 June 2026 07:57:04 PM

సర్వీస్ రివాల్వర్‌ తో కాల్చుకుని ఓ ఎస్.ఐ ఆత్మహత్య...

Date : 02 December 2024 10:27 AM Views : 518

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ములుగు జిల్లా : ములుగు జిల్లాలో నిన్న ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ ఘటన అనంతరం సర్వీస్ రివాల్వర్‌ తో కాల్చుకుని ఓ ఎస్.ఐ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ములుగు జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వాజేడు మండలంలోని పోలీస్ స్టేషన్‌లో రుద్రారపు హరీశ్ ఎస్సై‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రడ్జి సమీపంలో ఉన్న ఓ రిసార్ట్‌ లో హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఉన్నత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :