Sunday, 19 July 2026 09:24:22 PM

క్రిమి సంహారక మందు తాగి వ్యక్తి మృతి...

Date : 11 August 2025 06:31 AM Views : 523

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మహబూబ్‌నగర్‌ జిల్లా : మహబూబాబాద్ రూరల్ మండలం కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లపూసలపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వలసాని మురళి (39), కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన అతడు తరచూ తన భార్య రేణుకతో గొడవలు పెట్టుకుంటూ “చనిపోతా” అంటూ బెదిరింపులు చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.శనివారం ఉదయం మురళి అక్క ఇంటికి వచ్చి రాఖీ కట్టిన అనంతరం, భార్య రేణుక తన తల్లి ఇంటికి రాఖీ కట్టడానికి వెళ్లింది. ఈ సమయంలో మురళి ఒంటరిగా ఇంట్లో మద్యం సేవించి, మద్యం మత్తులో గ్రామ శివారులోని చెరువు కట్ట సమీపంలోని మల్లన్న గుడి వద్ద గడ్డి మందు తాగి కుప్ప కూలిపోయాడు.స్థానికుడు కాలేరు వెంకన్న ఈ దృశ్యం గమనించి మురళి అన్న యాకన్నకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్‌కు రిఫర్ చేశారు. అయితే చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు.ఈ ఘటనపై మృతుడు అన్న యాకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :