Sunday, 13 September 2026 02:14:50 AM

వైద్యులు జాప్యం చేయడంతో శిశువు మృతి

Date : 22 April 2023 12:43 PM Views : 439

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సంగారెడ్డి జిల్లా : పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయడంలో వైద్యులు జాప్యం చేయడంతో శిశువు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 20వ తేదీన పురిటి నొప్పులతో డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి రేణుక అనే గర్భిణి రాగా ఆమెను పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి ఆపరేషన్ చేయమని చెప్పడంతో 24 గంటలు ఎదురు చూసిన రేణుకకు నార్మల్ డెలివరీ కాలేదు. దీంతో చివరకు రేణుక పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆపరేష్‌న్ చేసి శిశువుని బయటకు తీశారు. అయితే అప్పటికే మగ శిశువు కడుపులోనే మృతి చెందింది. రేణుక పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూ చికిత్స అందజేస్తున్నారు. శిశువు మృతి విషయం తెలిసిన రేణుక బంధువులు ఆస్పత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయాడని బంధువులు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :