ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / తిరుపతి జిల్లా : తిరుపతికి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద చోటు చేసుకుంది.. వివరాలికి వెళ్తే.. తిరుమల కొండ మీదకు కాలినడకన కొంత మంది భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా మదనపల్లి నుంచి తిరుపతి రూయా ఆస్పత్రికి 108 అంబులెన్స్ రోగిని తీసుకవస్తు ఉండగా కాలినడకన వెళ్తున్న భక్తులపైకి అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పతిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన రెడ్డమ్మ, లక్ష్మమ్మగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News