Monday, 10 August 2026 04:25:34 PM

గుండె పోటుతో 10 వ తరగతి విద్యార్ధి మృతి...

కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన...

Date : 21 February 2025 10:34 AM Views : 535

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక కాలి నడకన పాఠశాలకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించింది.వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన బాలిక (14) కామారెడ్డిలోని కల్కినగర్‌ లోని తన పెదనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.అయితే ఉదయం బాక్సు తీసుకొని పాఠశాలకు బాలిక వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో స్కూలు సమీపంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలిక కుటుంబంలో విషాదం నెలకొంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :