Sunday, 19 July 2026 09:39:45 PM

ఫిలిప్పీన్స్ దేశంలో వైద్య విద్యార్థి మృతి...

యాదాద్రి జిల్లా వాసిగా గుర్తింపు...

Date : 23 April 2023 07:32 PM Views : 416

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / యాదాద్రి భువనగిరి జిల్లా : దవోవ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న గూడూరు మణికాంత్ రెడ్డి (22) అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... మణికాంత్ రెడ్డి మృతిపై ఫిలిప్పీన్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మణికాంత్ రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామం. 8 నెలల క్రితం మణికాంత్ రెడ్డి ఫిలిప్పీన్స్ వెళ్లాడు. అయితే ఏప్రిల్ 23వ తేదీ తెల్లవారుజామున అతను అనుమానాస్పదంగా మృతి చెందినట్లు దవోవ మెడికల్ కళాశాల యాజమాన్యం ఫోన్ చేసి సమాచారం అందించారు. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :