Friday, 16 January 2026 09:32:21 AM

ఏడేళ్ల చిన్నారి రేప్ కేసులో ముగ్గురికి జీవిత‌ఖైదు...

బ‌లోడా బ‌జార్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీల‌క తీర్పు

Date : 01 February 2024 05:36 PM Views : 406

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / అంతర్జాతీయం : చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌లోడా బ‌జార్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. ఏడేళ్ల చిన్నారిని రేప్ చేసిన కేసులో ముగ్గురు నిందితుల‌కు జీవిత‌ఖైదు శిక్ష‌ను విధించింది. 2021లో జ‌రిగిన రేప్, మ‌ర్డ‌ర్ కేసులో ఓ నిందితుడి ఆ ఘ‌ట‌న స‌మ‌యంలో 17 ఏళ్లు మాత్ర‌మే ఉన్నాడు. అద‌న‌పు జిల్లా సెష‌న్స్ జ‌డ్జి ప్ర‌శాంత్ ప‌రాష‌ర్ ఈ ఆదేశాల‌ను జారీ చేశారు. జ‌న‌వ‌రి 29వ తేదీన ఆదేశాలు ఇవ్వ‌గా, బుధ‌వారం ఆ తీర్పు కాపీని రిలీజ్ చేశారు. ఐపీసీ, పోక్సో, చ‌ట్టాల ప్ర‌కారం నిందితుల‌కు శిక్ష‌ను ఖ‌రారు చేశారు.బ‌లోడా బ‌జార్ సిటీ స‌మీపంలో ఉన్న ఓ గ్రామంలో త‌న ప‌క్కింట్లో చిన్నారి ఆడుకుంటున్న స‌మ‌యంలో 17 ఏళ్ల వ్య‌క్తి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి రేప్ చేశాడు. ఆ త‌ర్వాత త‌న త‌ల్లితో క‌లిసి ఆ చిన్నారిని హ‌త్య చేశాడు. మ‌రో నిందితుడితో క‌లిసి ఆ పాప మృత‌దేహాన్ని ఓ బావిలో ప‌డేశాడు. చిన్నారి మృత‌దేహం దొరికిన తర్వాత పోలీసులు విచార‌ణ చేప‌ట్టి ముగ్గురిపై కేసు బుక్ చేశారు. ఈ కేసులో 29 మంది నుంచి సాక్ష్యాలు సేక‌రించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :