Wednesday, 11 February 2026 08:11:05 PM

కుటుంబ కలహాలతో కానరాని లోకాలకు... పెళ్లైన ఆరు నెలలకే ప్రేమ జంట ఆత్మహత్య...

విషాదాంతంగా మారిన ప్రేమ వ్యవహారం... కొత్తగూడెం జిల్లా టేకులపల్లి లో విషాదం....

Date : 28 April 2025 12:24 PM Views : 850

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు... ఇద్దరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యులను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. ఇకపై ఒకరినొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకొని ఇద్దరు ఒకటయ్యారు.. దీంతో పెళ్ళైన వారి జీవితం సజావుగా సాగుతున్న నేపథ్యంలో వారి కుటుంబంలో నెలకొన్న సమస్యలతో క్షణికావేశంలోనో, లేక జీవితంపై మనస్థాపం చెందో తెలియదు కానీ పెళ్ళైన ఆరు నెలలకే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం, ఆత్మహత్య చేసుకున్న సమయానికి మూడు నెలల గర్భవతి కావడం ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే... టేకులపల్లి మండలం దాస్ తాండ గ్రామపంచాయతీ రేగుల తాండకు చెందిన ఇస్లావ దీపిక (19)లు వెంకటయ్య తాండకు చెందిన బోడ శ్రీను (23)లు ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వివాహంకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులను ఎదిరించి ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకొని వారికి దూరంగా ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం వెంకటయ్య తండాలోని శ్రీనివాస్ నివాసానికి అక్కడే ఉంటున్న సమయంలో గత రెండు నెలలుగా కుటుంబ సభ్యులు వరకట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ ఉండడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దీపిక మూడు నెలల గర్భవతిగా తేలింది. ఈ సమయంలో ఎంతో ఆనందంగా గడపాల్సిన రెండు కుటుంబాలు వరకట్నం చిచ్చుతో విషాదంగా మారాయి. తరచూ వారి కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన ప్రేమ జంట మనస్థాపంతో ఈ నెల 24వ తేదీన కూల్ డ్రింక్ లో గడ్డి మందు, ఎలుకల మందు కలుపుకొని మొదట శ్రీను సేవించాడు. ఆ తర్వాత తాను మందు తాగిన విషయాన్ని ఇంటికి వచ్చి భార్యకు తెలిపాడు. వెంటనే భార్య దీపిక కూడా అదే కూల్ డ్రింకును తీసుకొని తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు భార్యాభర్తలను మొదట కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిద్దరిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో ఈనెల 25వ తేదీన దీపిక మృతి చెందగా, అప్పటి నుండి చికిత్స పొందుతున్న శ్రీను సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. జీవితంపై ఎన్నో ఆశలతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట కుటుంబ కలహాలతో తనువు చాలించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆత్మహత్య చేసుకునే సమయానికి దీపిక మూడు నెలల గర్భవతి కావడం అందరిని కలచివేసింది ఈ ఘటన కన్నీటి పర్యంతం అయింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :