ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : నిఘా నేత్రాల ముసుగులో గుట్టుగా గంజాయి వ్యాపారం చేస్తున్న నిందితులను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి భాస్కర్ ఆధ్వర్యంలో మంచిరాల ఏసిపి పర్యవేక్షణలో పోలీసులు కట్టడి చేశారు. సుమారు 11 లక్షల 75 వేల, 23.5 కిలోల గంజాయినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 11 మంది నిందితులను అరెస్టు చేయగా పరారీలో ముఠా నాయకునితోపాటు మరో 11 మంది సహచర నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే... సీలేరు నుండి కొనుగోలు చేసి తెచ్చిన గంజాయిని మంచిర్యాలలోని ఐబీ X రోడ్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్ కింద ఉన్న ప్రవీణ్ కుమార్ సంబంధించిన Y INFO సొల్యూషన్స్ సీసీ కెమెరాల గోదాంలో చట్ట వ్యతిరేకంగా గంజాయి నిల్వ ఉందని నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించి తనిఖీ చేయగా అక్కడే కాటన్ బాక్సులలో ప్యాక్ చేసిన గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని బీజాపూర్, మేడారం, మంథని, గోదావరిఖని మీదుగా తీసుకువచ్చి ప్రవీణ్ కు సంబంధించిన సీసీ కెమెరాలు గోదాంలో నిందితులు పంచుకునే వారని తెలిపారు. ఈ గంజాయిని మంచిరాలతో పాటు చుట్టుపక్కల వారికి సరఫరా చేసేవారని పేర్కొన్నారు. ఈ ఘటనలో మంచిర్యాల రాజీవ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఇరుగురాళ్ల సతీష్ కుమార్, సప్తగిరి కాలనీకి చెందిన మహమ్మద్ సమీర్, భగవంతం వాడకు చెందిన బీమా అనుదీప్, తిలక్ నగర్ కు చెందిన జియో వైఫై టెక్నీషియన్ మహమ్మద్ అబ్దుల్ ఉబేద్, భరత్ నగర్ కు చెందిన అర్జున్ బాబురావు చౌహన్, కరీంనగర్ జిల్లా కార్ఖాన గడ్డకు చెందిన మహమ్మద్ అజీజ్, మంచిర్యాల రాజీవ్ నగర్ కు చెందిన జాడి రాఘవేంద్ర స్వామి,సీసీసీ నస్పూర్ కు చెందిన గూడూరు రాము, ఎస్.కె అత్తహుర్, ఎస్ కే సలీం,తో పాటు ఓ మైనర్ బాలుడిని పోలీసులు తీసుకున్నారు. అలాగే పరారీలో ఉన్న నిందితులు మంచిర్యాల ఎన్టీఆర్ నగర్ కు చెందిన సోమ ప్రవీణ్, తగారపు రాజు, తగారపు శృతి, తగారపు వినయ్, రామాలయం, రాకేష్, శ్రీధర్, మున్ని, వికలాంగుడు చింటూ, అల్మేకర్ శ్యామ్, క్వార్టర్ సాయి, సాహెల్ లు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ గంజాయి ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన టాస్క్ ఫోర్స్ మంచిర్యాల పోలీసులను సిపి అభినందించారు. ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి డిసిపి చేతన, డిసిపి అడ్మిన్ రాజు, ఏసిపి స్పెషల్ బ్రాంచ్ రాఘవేంద్ర, ఏసిపి మంచిర్యాల ప్రకాష్, ఏసిపి టాస్క్ ఫోర్స్ మల్లారెడ్డి, సిఐలు ప్రమోద్, రాజ్ కుమార్, రమేష్, టాస్క్ ఫోర్స్ ఎస్సైలు లచ్చన్న, ఉపేందర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Aakanksha News