ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనపురం హైవే పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయలైయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...దొడగుట్ట గ్రామానికి చెందిన గ్రామస్తులు కేటీపీ చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం తెల్లవారు జామున ఆటోను గుర్తు తెలియని వాహనం డీ కొనడంతో అక్కడికక్కడే అలివేలమ్మ, లక్ష్మమ్మ, నర్సమ్మ లు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు
Admin
Aakanksha News