ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : వరంగల్ శివనగర్‌కు చెందిన మహమ్మద్ సహనా బేగం శనివారం జరిగిన సంఘటనలో పోలీసుల చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం ప్రకారం, సహనా బేగం తన ఇద్దరు మనవరాళ్లతో కలిసి మహబూబాబాద్ పట్టణానికి వచ్చారు. కురవి గేట్ వద్ద ఆటో ఎక్కి బేతోల్ స్టేజీ వద్ద దిగిన అనంతరం చెల్లెలి ఇంటికి వెళ్లిన ఆమె తన బ్యాగ్ ఆటోలో మరిచిపోయినట్లు గుర్తించారు.ఆందోళనకు గురైన బాధితురాలు వెంటనే కురవి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఘటన వివరాలు తెలియజేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన రెండో ఎస్సై జయకుమార్, మహిళా కానిస్టేబుల్ అనిత, కానిస్టేబుల్ రమేష్ వెంటనే స్పందించి సాంకేతిక ఆధారాలతో ఆటో ప్రయాణ దిశను గుర్తించారు.పోలీసులు బాధితురాలిని వెంట తీసుకుని పోలీస్ వాహనంలో మరిపెడ వైపు బయల్దేరి, పురుషోత్తమాయగూడెం సమీపంలో ఆ ఆటోను ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో బ్యాగ్ సురక్షితంగా లభించింది. అందులో ఒక తులం బంగారం, రెండు స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.తన వస్తువులు సురక్షితంగా తిరిగి లభించడంతో మహమ్మద్ సహనా బేగం ఆనందభాష్పాలు పెట్టి, పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “ఇలాంటి సత్వర స్పందనతో ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Admin
Aakanksha News