Thursday, 25 June 2026 07:58:50 PM

శానిటేషన్ సిబ్బందిపై ఉన్న చర్యలు సూపర్వైజర్ పై ఉండవా... ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు...

సూపర్వైజర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ...

Date : 07 August 2025 03:45 PM Views : 725

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : ఆస్పత్రిలో పని చేసే చిన్నస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారులకు కొంతమంది రాజకీయ పలుకుబడితో అండదండలతో రెచ్చిపోయి మహిళలను ఇబ్బందులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారా అంటే అవుననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రోగుల వద్ద నుండి డబ్బులు తీసుకుంటున్నారని కిందిస్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకొని వారిని విధుల్లో నుంచి తొలగించారు. అయితే వారిపై తీసుకున్న చర్యలు ఆసుపత్రిలో ఓ సూపర్ వైజర్ పై ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తనకు ఉన్న రాజకీయ పలుకుబడితో ఇష్టరాజ్యంగా తన స్థాయికి మించి ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళితే.. ఆస్పత్రిలో పనిచేసే ఓ మహిళలను సూపర్వైజర్ ఇబ్బందులకు గురి చేయడంతో ఆ వేధింపులు భరించలేక రాత్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నేపథ్యంలో స్థానికంగా ఉండే సిబ్బంది అడ్డుకొని నచ్చచెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఘటనపై సదురు మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా తనకున్న రాజకీయ అండదండలతో సదురు సూపర్వైజర్ హాస్పటల్లో విధుల్లో ఉన్న సమయంలో తమ ఫోటోలు తీస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏకంగా సిబ్బంది అంతా ఏకమై ఆసుపత్రిలో ఆందోళన చేసిన ఇప్పటివరకు అది అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ అండదండలు ఉంటే ఏది చేసినా చర్యలు తీసుకోరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదో ఒకసారి అయితే పొరపాటయింది అనుకోవచ్చు కానీ ప్రతిసారి సదరు సూపర్వైజర్ మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతరమేమిటో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి గతంలో జరిగిన సంఘటనలతో పాటు గత రాత్రి జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి వివాదాస్పదంగా మారుతున్న సదురు సూపర్వైజర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :