Tuesday, 22 September 2026 07:28:31 AM

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

Date : 21 April 2023 09:35 PM Views : 551

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా కోటగండి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...చెన్నారావుపేట మండలంలోని కల్నాయక్ తండ గ్రామ పంచాయతీకి చెందిన బాదావత్ భద్రు జీవనోపాధి కోసం వరంగల్ కు ఆటో నడుపుకుందామని రాగా కోటగండి వద్ద అతి వేగంగా కారు వచ్చి ఆటో ను ఢీ కొట్టడంతో, ఆటో డ్రైవర్ బాదావత్ బద్రు ను కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏంజిఎమ్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్య సరిత రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. తండ్రి బాదావత్ ఈరియా పిర్యాదు మేరకు గీసుకొండ ఎస్సై వెంకన్న కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :