ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందగా మరొక్కరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హుజురాబాద్ మండలం మాందాడిపల్లిలో వరంగల్,కరీంనగర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా ఫైర్ సిబ్బంది, స్థానికులు కలసి డ్రైవర్‌ను బయటకు తీశారు.చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News