ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆకాంక్ష డెస్క్ : సమాజంలో జరిగే కొన్ని ప్రేమ సంఘటనలు విచిత్రనికి దారి తీస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు,. ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో కొందరు తిర్హమా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో జరిగే సంఘటనలతో ఎటు పిల్లలను. భర్తను కుటుంబాన్ని కోల్పోతున్నారు. దీనికి నిదర్శనం ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటనే అని చెప్పవచ్చు. యూపీలోని హర్దోయ్ లో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలి బిచ్చగాడితో పారిపోయింది. వివరాల్లోకి వెళ్తే... హర్పల్‌పుర్ లో జీవిస్తున్న 45 ఏళ్ల రాజుకు.. రాజేశ్వరి అనే మహిళతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే యూపీలోని హర్దోయ్ లో 36 ఏళ్ల రాజేశ్వరి అనే మహిళ తన ఇంటి పరిసరాల్లో అడుక్కోవడానికి వచ్చిన నానే పండిట్ అనే బిచ్చగాడితో ప్రేమలో పడింది. దీంతో ఆరుగురు పిల్లలని, భర్తను విడిచి పెట్టి బిచ్చగాడితో పారిపోయింది. అయితే బట్టలు, కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు కూతురు ఖుష్బూకు చెప్పి వెళ్లిందని తన భార్య తిరిగి రాకపోవడంతో ఆమె కోసం వెతికినా జాడలేదని భర్త పోలీసులకు పిర్యాదు చేసాడు. అంతే కాకుండా ఓ బర్రెను అమ్మితే వచ్చిన డబ్బులతో తన భార్య వెళ్లిపోయినట్లు రాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నానే పండిట్ అనే బిచ్చగాడు తన భార్యను తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. నానే పండిట్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బీఎన్ఎస్‌లోని సెక్షన్ 87 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Admin
Aakanksha News