ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / విశాకపట్నం జిల్లా : కొత్త జీవితం..కొత్త కొత్త ఆశలతో అడుగు పెట్టిన ఓ నవ వధువు ఆశలు చెల్లా చెదురయ్యాయి. కట్టుకున్న భర్తతో సంతోషంగా జీవించాలని కన్న కలలు, కలలుగానే మిగిలిపోయాయి. కొత్తగా పెళ్లయిన భర్త పోర్న్ వీడియోలకి బానిస కాగా నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా గోపాలపట్నంలో చోటుచేసుకుంది.11 నెలల కిందట వసంత అనే మహిళ నాగేంద్రబాబుని పెళ్లి చేసుకుంది. అయితే పోర్న్ వీడియోలలో చేసినట్టు చేయాలంటూ భార్య వసంతపై భర్త ఒత్తిడి తెచ్చాడు.దీంతో మానసిక ఒత్తిడికి గురైనా భార్య ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటనపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Admin
Aakanksha News