ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వేరువేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రామగిరి మండలంలోని పెద్దపల్లి మంథని రహదారిపై రాణి రుద్రమదేవి స్టేడియం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం డీ కొనడంతో సింగరేణి కార్మికుడు వేగోళపు శ్రీనివాస్ గౌడ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో....
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ధర్మారం మండలం కానంపల్లి గ్రామానికి చెందిన గుర్రం సురేష్ గౌడ్ తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
Admin
Aakanksha News