ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జోగులంబ గద్వాల జిల్లా : కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా నరికి హత్య చేసిన సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మొగిల్ రావు పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గత కొన్ని రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో భార్య అలివేలు గొడ్డలితో భర్త మంద దేవ రాజును(35) నరికి చంపింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Admin
Aakanksha News