ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సూర్యాపేట జిల్లా : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని కొమరబండ గ్రామం ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ద్విచక్ర వాహనంపై ఉన్న ఎం కనకేశ్వరశర్మ, కుక్కడపు పుల్లయ్య వెళ్తుండగా వెనుక వైపు నుండి టాటా ఏసీ వాహనం తమ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే కనకేశ్వరశర్మ మృతి చెందగా పుల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Admin
Aakanksha News