Tuesday, 22 September 2026 12:18:40 PM

స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన మటన్ బొక్కలు

మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య....

Date : 16 January 2024 09:27 AM Views : 465

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : సంక్రాంతి పండుగ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది.. మటన్ బొక్కల కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడడంతో ఒకరి దారుణ హత్యకు దారి తీసింది..ఈ దారుణ ఘటన సికింద్రాబాద్‌ తుకారాం గేటు పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే... గోల్‌బాయ్‌ బస్తీకి చెందిన చారి, అజయ్‌కి మధ్య మటన్‌ తినే విషయంలో గొడవ జరిగింది. అయితే ఇద్దరు అప్పటికే పీకలదాకా మద్యం తాగేసి ఉండటంతో గొడవ కాస్త ఘర్షణగా మారింది.ఈ క్రమంలోనే చారిపై అజయ్‌ కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడటంతో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :