Thursday, 25 June 2026 07:58:25 PM

భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య...

Date : 26 October 2025 07:45 PM Views : 329

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఏలూరు జిల్లా : భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రాక పోవడంతో భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే — ఏలూరు రూరల్ మండలంలోని మారుతి నగర్‌కు చెందిన సుందరమతి దుర్గారావు (35) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా చిన్నచిన్న మనస్పర్ధలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సుమారు 15 రోజుల క్రితం దుర్గారావు భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి భర్త వద్దకు తిరిగి రాకపోవడంతో దుర్గారావు తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని జీవితాన్ని ముగించుకున్నాడు. సమాచారం అందిన వెంటనే ఏలూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :