Saturday, 07 December 2024 01:57:58 PM

రైలు కింద పడి జర్నలిస్ట్ ఆత్మహత్య.

Date : 13 April 2023 11:42 AM Views : 3285

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంథని : పెద్దపల్లి రైల్వేస్టేషన్ లో రామగిరి మండలంకు చెందిన పొన్నం శ్రీకాంత్ అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..రామగిరి మండలంకు ఓ పత్రికలో విలేకరిగా చేస్తున్న శ్రీకాంత్ ను కొంత మంది వేధింపులకు గురి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి రైల్వేస్టేషన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ : రామగిరి ఎస్ఐకి నమస్కారం. నా చావుకు కారణం నా జర్నలిస్ట్ వృత్తిలో అడ్డు తగులుతూ నన్ను ఇబ్బదులకు గురిచేస్తున్నారు. కొప్పుల గణపతి కాంగ్రెస్ ఎంపీటీసీ, చిందం రమేష్, పొన్నం శ్రీనివాస్ లు, కోట రవీందర్ రెడ్డిలు నువ్వు మనిషినే తిన్న ప్లేట్ తీసిన నాపై బురద జల్లడం. ని టీ అయిన ఎప్పుడైనా తగానా. సంవత్సరం కాలంగా సైలెంట్ గా ఉండి ఇప్పుడు బురద చల్లడంలో ని అతర్యమేంటి కోట.? ని వల్ల యూనియన్ లో ఎలాంటి అభివృద్ధి లేదని అనుకున్నది రాయడం నా వృత్తిలో తప్పా.? నా చావుపై ఇంకా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. విచారణ అవసరం లేదు. నాకు నా ఇష్టమైన జర్నలిస్ట్ వృత్తిలో సహకరించిన బాలవర్ధన్ సర్, అనిల్ రావ్ సర్, వేణు అన్న, శ్రీకాంత్ సర్, రాజీ రెడ్డి సర్, సాయి శంకర్ అన్న, సుకుమార్ అన్న, నారు సర్, చంద్రమోహన్ అన్న, కుమార్ అన్న, రవికుమార్ అన్న, రత్నం సర్, రవీందర్ అన్న, మల్లేష్ అన్న, నా మిత్రులు సారన్న, మా మేనేజర్ సర్ బిబిఆర్, నాగరాజు అన్న, రమేష్, మీ అందరూ క్షమించండి. క్షమించారని వారు మామా అత్త, అక్క బావ, ఇద్దరన్నలు, వదినలు, సుదన్న, అందరూ బాగుడాలి అందులో మా అమ్మ ఉండాలి. మళ్ళీ మా అమ్మ కడుపులో పుట్టి మీ రుణం తీర్చుకోవాలి ఇదే నా కోరిక. విజయ్ మా మామనికి కలువు, సారన్న చెప్పింది నేను చెప్పినట్టే మామా, చందుకి 2లక్షలు ఇవ్వాలి. నా ఇల్లు అప్పు, పూర్తి ఇల్లు బాధ్యత, మిగితా అన్ని మా మామా అంజయ్యదే తుది నిర్ణయం. నేను ఎవ్వరిని మోసం చేయలేదు. ఎవరి వద్ద వృత్తిని అడ్డుపెట్టుకొని దోచుకోలేదు. నా చివరి కోరిక మండలంలోని జర్నలిస్టులందరికీ ఇండ్లు కట్టివాలి. పై నలుగురికి తకణమే శిక్ష పడాలి. పొన్నం శ్రీకాంత్, రామగిరి రిపోర్టర్,

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :