Saturday, 26 September 2026 07:14:14 AM

ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు....

చివరకు మోసపోయామని సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన బాధితుడు...

Date : 23 September 2024 10:17 PM Views : 681

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / అంతర్జాతీయం : ఉత్తర ప్రదేశ్ లోని మౌయిమాలోని బక్రాబాద్ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.అల్తాఫ్ ఖాన్ అనే యువకుడు సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ లో ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు.ఈ ప్రకటనను చూసి ఓ యువకుడు ట్రాప్ లో పడ్డాడు.అందులో ధనిక కుటుంబాల అమ్మాయిలను గర్భవతిని చేసే ఉద్యోగం ఉందని, ఐదు లక్షల రూపాయల జీతంతో పాటు విలాసాలు కల్పిస్తామని అందులో రాసుంది. ఈ క్రమంలో.. యువకుడు అందులో నంబర్లకు ఫోన్ చేయగా.. అడ్వర్టైజ్ మొదట రూ.800 కట్టాలని చెప్పాడన్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషకు రూ.24 వేలు పంపించాడు. అడ్వర్టైజర్లు మళ్లీ యువకుడి నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు.అయితే అసలు విషయాన్ని బాధితుడు తెలుసుకుని మోసపోయానని గ్రహించాడు. సైబర్ మోసగాళ్లు ఎస్పీ, డీఎస్పీల ప్రొఫైల్ ఫోటోలు ఉన్న నంబర్లతో కాల్ చేసి డబ్బు చెల్లించాలని బాధిత యువకుడిని టార్చర్ చేశారు. లేదంటే.. కేసు నమోదు చేసి ఇరికిస్తామని బెదిరించారు. దీంతో యువకుడు భయపడి గ్రామ సామాజిక కార్యకర్తకు విషయం చెప్పాడు. అనంతరం.. బాధితుడు సైబర్ క్రైమ్ ప్రయాగాజ్కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి డబ్బులు తిరిగి ఇప్పించాలని డీసీపీ క్రైం బాధితుడు కోరాడు. అయితే.. ఇంతకుముందు కూడా చాలా మంది యువకులు ఇలానే మోసపోయారని.. ఈ క్రమంలో అవమానానికి భయపడి వారు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :