Tuesday, 11 August 2026 05:43:34 PM

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ లో దారుణం..

భార్య మీద కోపంతో తల్లిని చంపినా కుమారుడు..

Date : 05 April 2025 11:53 AM Views : 619

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండంలో క్షణికావేశంలోనో లేక తొందరపాటు ఆలోచనతోనో తల్లిని కొడుకు హత్య చేసిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కొత్తతండాకు చెందిన శ్రీను తన భార్యతో కలిసి పొరుగూరులో నివాసం ఉంటున్నాడు. అయితే ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్దమ్ రావడంతో భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. ఇదే విషయంపై శ్రీనును తల్లి మందలించడంతో ఆగ్రహానికి గురైన శ్రీను తల్లిని కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :