ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ములుగు జిల్లా : మావోయిస్టుల ఉగ్రకావ్యత.. పోలీసులు లక్ష్యంగా పెట్టిన బాంబు సామాన్యుడి ప్రాణాలపై ముప్పుగా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని కర్రెగుట్టల అడవుల్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. పోలీసులను లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు కదలికలకే స్పందించి పేలింది. ఈ బాంబు పేలుడులో కామయ్య అనే స్థానిక యువకుడి ఎడమ కాలు నుజ్జునుజ్జయింది.వివరాల ప్రకారం, కామయ్య అనే యువకుడు అడవిలో వెదురు కోసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తూ ప్రెషర్‌బాంబుపై కాలు వేసాడు. ఒక్కసారిగా శబ్దంతో బాంబు పేలడంతో అక్కడికక్కడే అతడి కాలు తీవ్రంగా దెబ్బతింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతన్ని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కామయ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.పోలీసుల వివరణ ప్రకారం, ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్న నేపథ్యంలో వారు అమర్చిన బాంబే ఇదని, బలగాలను లక్ష్యంగా పెట్టుకున్నా అది ఆ పాదచారిపై విరుచుకుపడిందని చెప్పారు. ఘటనాస్థలాన్ని పోలీసులు సీజ్ చేసి మరిన్ని బాంబులు లేదా ఉగ్రవస్తువులున్నాయేమో అనేది పరిశీలిస్తున్నారు. ఎక్స్‌ప్లోసివ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది.ఈ ఘటన అనంతరం వెంకటాపురం మండల పరిధిలో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ప్రజలు అడవిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. పోలీసులు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు ప్రారంభించారు.
Admin
Aakanksha News