Thursday, 25 June 2026 07:55:42 PM

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో అక్రమ ఇసుక రవాణా: రెండు ట్రాక్టర్లు సీజ్

Date : 31 July 2025 12:59 PM Views : 495

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ కేంద్రంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించిన బిచ్కుంద ఎస్‌ఐ మోహన్ రెడ్డి దాడి నిర్వహించి ఈ ట్రాక్టర్లను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సంబంధిత వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కూడా ఎవరు చట్ట విరుద్ధంగా ఇసుకను తరలించినా మినహాయింపు ఉండదన్నారు. ఇలాంటి అక్రమాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :